పూజా హెగ్డేతో ఈ బ్యాచ్‌లర్‌ ఏం చేయిస్తున్నాడో చూశారా?

ABN , First Publish Date - 2020-11-14T00:18:52+05:30 IST

దీపావళి కళ అంతా అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ పోస్టర్‌లోనే కనిపిస్తుంది. అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్

పూజా హెగ్డేతో ఈ బ్యాచ్‌లర్‌ ఏం చేయిస్తున్నాడో చూశారా?

దీపావళి కళ అంతా అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ పోస్టర్‌లోనే కనిపిస్తుంది. అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా మ‌రో నిర్మాత వాసు వ‌ర్మతో కలిసి రూపొందిస్తున్న సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. దీపావళి కానుకగా ఈ చిత్ర న్యూ పోస్టర్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో పూజా హెగ్డేకి బ్యాచ్‌లర్‌.. అదే అఖిల్‌ అక్కినేని చుచ్చుబిడ్డిని వెలిగించడం నేర్పుతున్నాడు. ఈ పోస్టర్‌ చాలా ముచ్చటగా ఉంది. అఖిల్‌ కూడా కొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. దీపావళి శుభాకాంక్ష‌లు తెలుపుతూ చిత్ర యూనిట్ ఈ క‌ల‌ర్‌ఫుల్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇప్ప‌డు దీపావ‌ళికి చుచ్చుబ‌డ్డిని పూజాతో వెలిగించేసి ఈ బ్యాచ్‌లర్‌ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.Updated Date - 2020-11-14T00:18:52+05:30 IST