‘మోస‌గాళ్ళు’ విడుద‌ల తేది ఖ‌రారు?

ABN , First Publish Date - 2020-03-29T18:40:25+05:30 IST

24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘మోస‌గాళ్ళు’. జెఫ్రీ గీ చిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

‘మోస‌గాళ్ళు’ విడుద‌ల తేది ఖ‌రారు?

24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘మోస‌గాళ్ళు’. జెఫ్రీ గీ చిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాష‌ల్లో రూపొందుతోన్న చిత్ర‌మిది. రుహానీ సింగ్‌హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అతి పెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా సినిమా తెర‌కెక్కుతోంది. కొంత మేర షూటింగ్ మిన‌హా ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ఈ సినిమాను జూన్ 5న తెలుగులో విడుద‌ల చేయాల‌ని అనుకుంట‌న్న‌ట్లు మంచు విష్ణు తెలిపారు. తెలుగులో విడుద‌లైన కొన్ని రోజుల త‌ర్వాత ఇంగ్లీష్‌లో విడుద‌ల చేస్తార‌ట‌.

Updated Date - 2020-03-29T18:40:25+05:30 IST