నా జోన్‌లో తప్పు చేస్తే... వాడి లైఫ్‌ డేంజర్‌ జోనే!

ABN , First Publish Date - 2020-11-14T05:14:16+05:30 IST

‘‘నా జోన్‌లో ఎవడైనా తప్పు చేస్తే... వాడి లైఫ్‌ ఇక డేంజర్‌ జోనే! వాడెంత తోపైనా... నహీ చోడుంగా (వదిలిపెట్టను)’’ అని నటుడు సునీల్‌ శెట్టి అంటున్నారు. శక్తిమంతమైన పోలీస్‌ అధికారి అజిత్‌కుమార్‌ భాటియా పాత్రలో ఆయన నటిస్తున్న సినిమా....

నా జోన్‌లో తప్పు చేస్తే... వాడి లైఫ్‌ డేంజర్‌ జోనే!

‘‘నా జోన్‌లో ఎవడైనా తప్పు చేస్తే... వాడి లైఫ్‌ ఇక డేంజర్‌ జోనే! వాడెంత తోపైనా... నహీ చోడుంగా (వదిలిపెట్టను)’’ అని నటుడు సునీల్‌ శెట్టి అంటున్నారు. శక్తిమంతమైన పోలీస్‌ అధికారి అజిత్‌కుమార్‌ భాటియా పాత్రలో ఆయన నటిస్తున్న సినిమా ‘మోసగాళ్లు’. విష్ణు మంచు హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రమిది. దీపావళి సందర్భంగా సునీల్‌ శెట్టి క్యారెక్టర్‌ టీజర్‌ విడుదల చేశారు. అమెరికాను కుదిపేసిన భారీ ఐటీ స్కామ్‌కి బాధ్యులైన భారతీయులను పట్టుకునే అధికారిగా ఆయన కనిపించనున్నట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్‌ దర్శకుడు. విష్ణు సోదరిగా కాజల్‌ అగర్వాల్‌, అతనికి జంటగా రూహీ సింగ్‌, ఇతర ప్రధాన పాత్రల్లో నవదీప్‌, నవీన్‌ చంద్ర కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్యామ్‌ సీఎస్‌ సంగీత దర్శకుడు.

Updated Date - 2020-11-14T05:14:16+05:30 IST