నెం.1 హీరోయిన్ ఎవరో తెలుసా?

ABN , First Publish Date - 2020-08-08T19:36:25+05:30 IST

కరోనా కారణంగా కొద్ది నెలలుగా సినీ పరిశ్రమ మూగబోయింది.

నెం.1 హీరోయిన్ ఎవరో తెలుసా?

కరోనా కారణంగా కొద్ది నెలలుగా సినీ పరిశ్రమ మూగబోయింది. సినిమా థియేటర్లు, షూటింగ్‌లు బంద్ అయిపోయాయి. ఎప్పుడూ షూటింగ్‌లతో  బిజీగా ఉండే సినిమా స్టార్లు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటి సమయంలో ఓ ప్రముఖ మీడియా సంస్థ `మూడ్‌ ఆఫ్‌ ది నేషన్` పేరిట ఓ సర్వే నిర్వహించింది. 


ఈ సర్వేలో అత్యంత ప్రజాదరణ కలిగిన హీరోయిన్‌గా దీపికా పదుకొనే నిలిచింది. ప్రియాంక, ఆలియా భట్, ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్ వంటి వారిని వెనక్కి నెట్టి దీపిక ఈ జాబితాలో అగ్ర స్థానంలో నిలిచింది. ఈ సర్వేలో దీపికకు 16 శాతం ఓట్లు పడ్డాయి. ఇక, తర్వాతి స్థానాల్లో ప్రియాంకా చోప్రా (14 శాతం ఓట్లు), కత్రినా కైఫ్‌ (13), ఐశ్వర్యారాయ్‌ (10), అనుష్కా శర్మ (9) ఉన్నారు. బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ కంగన, ఆలియా భట్ సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచారు. 


Updated Date - 2020-08-08T19:36:25+05:30 IST

Read more