బుల్లితెరపై మోనాల్‌..!

ABN , First Publish Date - 2020-12-27T02:26:29+05:30 IST

బిగ్ బాస్4లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచిన మోనాల్ త్వరలోనే బుల్లి తెరపై ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.

బుల్లితెరపై మోనాల్‌..!

బిగ్‌బాస్‌ ముందు ఐదు తెలుగు సినిమాల్లో నటించిన హీరోయిన్‌ మోనాల్‌ గజ్జర్‌కు తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. ఇక ఇంటికి తట్టా బుట్టా సర్దేయాలని అనుకుంటున్న సమయంలో ఆమెకు బిగ్‌బాస్‌ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 4లోని 16 మంది కంటెస్టెంట్స్‌లో మోనాల్‌ కూడా ఒకటి. బిగ్‌బాస్‌లో అభిజీత్‌, అఖిల్‌, మోనాల్‌ లవ్‌ట్రాక్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. షోలో మసాలా పోకూడదనే ఉద్దేశంతోనే బిగ్‌బాస్‌ నిర్వాహకులు కూడా ఆమెను దాదాపు చివరి వరకు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండేలా చూసుకున్నారు. ఏదేతేనేం.. ఇప్పుడు బిగ్‌బాస్‌ 4 నుంచి వచ్చిన క్రేజ్‌ను మోనాల్‌ క్యాష్‌ చేసుకుంటుంది. అందులో భాగంగా ఓంకార్‌ నిర్వహించే డాన్స్‌ ప్లస్‌ అనే కార్యక్రమానికి మోనాల్‌ హోస్ట్‌గా కనిపించనుందని టాక్‌. అసలు ఈ డాన్స్‌ షోలో మోనాల్‌ హోస్ట్‌గా చేస్తుందా?  లేక కీలకంగా వ్యవహరిస్తుందా? అనే దానిపై క్లారిటీ లేదు కానీ.. ఈ డాన్స్‌ ప్లస్‌ షోకు సంబంధించిన వీడియో ప్రోమో విడుదలైంది. ఇందులో మోనాల్‌ కనిపిస్తుంది కానీ.. ఆమె పాత్ర ఏంటో మాత్రం తెలియడం లేదు. ఓరోజు ఆగితే ఈ సస్పెన్స్‌కు తెరపడటం ఖాయం. 

Updated Date - 2020-12-27T02:26:29+05:30 IST