'అల్లుడు అదుర్స్‌'లో మోనాల్‌ గజ్జర్‌

ABN , First Publish Date - 2020-12-30T01:44:14+05:30 IST

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా సంతోష్ శ్రీ‌నివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'అల్లుడు అదుర్స్' చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో మోనాల్ గజ్జర్ నటిస్తుంది

'అల్లుడు అదుర్స్‌'లో మోనాల్‌ గజ్జర్‌

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా సంతోష్ శ్రీ‌నివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'అల్లుడు అదుర్స్' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 15న విడుద‌ల‌ చేయబోతోన్నట్లుగా దర్శకనిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఐటెమ్‌ సాంగ్‌ చిత్రీకరణ అన్నపూర్ణ సెవెన్‌ ఏకర్స్‌లో జరుగుతుంది. ఆసక్తికరమైన విషయమేమంటే .. ఈ పాటలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో హీరోయిన్‌, బిగ్‌బాస్‌ 4 కంటెస్టెంట్‌ మోనాల్‌ గజ్జర్‌ ఆడిపాడుతుంది. సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుబ్ర‌హ్మ‌ణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప‌ర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ స‌ర‌స‌న న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌, సోను సూద్, వెన్నెల కిశోర్‌, స‌త్యా కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, చోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.


Updated Date - 2020-12-30T01:44:14+05:30 IST