త్రీడీ మూవీ డైరెక్ట్‌ చేస్తున్న మోహన్‌లాల్‌

ABN , First Publish Date - 2020-10-18T17:51:57+05:30 IST

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ దర్శకత్వం వహించడానికి అంతా సిద్ధమైంది. కొన్నిరోజుల ముందే మోహన్‌లాల్‌ డైరెక్షన్‌కు సంబంధించిన వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. పిల్లల చిత్రమిది.

త్రీడీ మూవీ డైరెక్ట్‌ చేస్తున్న మోహన్‌లాల్‌

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ దర్శకత్వం వహించడానికి అంతా సిద్ధమైంది. కొన్నిరోజుల ముందే మోహన్‌లాల్‌ డైరెక్షన్‌కు సంబంధించిన వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. పిల్లల చిత్రమిది. 'బార్రోజ్‌' అనే పేరుతో తెరకెక్కబోతన్న త్రీడీ ఫాంటసీ మూవీ ఇది. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ టైటిల్‌పాత్రను పోషిస్తున్నారు. దర్శకత్వం వహించడంతో పాటు ఈ చిత్రాన్ని మోహన్‌లాల్‌ నిర్మిస్తున్నారు కూడా. ఈ చిత్రానికి 13 ఏళ్ల లిడియన్‌ నాదస్వరం సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. అలాగే ఈ చిత్రంలో పాజ్‌ వెగా, రఫేల్‌ అమెగా వంటి ఇంటర్నేషనల్‌ స్టార్స్‌ కూడా నటిస్తున్నారు. సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమా పోస్టర్‌ విడుదలైంది. 


Updated Date - 2020-10-18T17:51:57+05:30 IST