క‌లెక్ష‌న్ కింగ్ మెగాఫోన్‌

ABN , First Publish Date - 2020-08-25T14:10:34+05:30 IST

త్వ‌ర‌లోనే ఆయ‌న మెగాఫోన్ ప‌ట్ట‌నున్న‌ట్లు రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు మోహన్‌బాబు.

క‌లెక్ష‌న్ కింగ్ మెగాఫోన్‌

క‌థానాయ‌కుడిగా, ప్ర‌తినాయ‌కుడిగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా 560పైగా చిత్రాల్లో న‌టించ‌డ‌మే కాకుండా యాబైకి పైగా చిత్రాల‌ను శ్రీ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మించిన వ్య‌క్తి మోహ‌న్‌బాబు. గ‌త కొంత‌కాలంగా చాలా ప‌రిమితంగానే సినిమాల్లో న‌టించ‌డానికే ఆయ‌న ఒప్పుకుంటున్నారు. కాస్త గ్యాప్ త‌ర్వాత క‌లెక్ష‌న్ కింగ్ తాను ‘స‌న్నాఫ్ ఇండియా’ చిత్రంలో న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  అంతే కాకుండా త్వ‌ర‌లోనే ఆయ‌న మెగాఫోన్ ప‌ట్ట‌నున్న‌ట్లు రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు మోహన్‌బాబు. అందుకు క‌థ కూడా సిద్ధ‌మైంద‌ట‌. త్వ‌ర‌లోనే న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల‌ను ఫైన‌లైజ్ చేసిన త‌ర్వాత ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేస్తామ‌ని మోహన్‌బాబు అన్నారు. 

Updated Date - 2020-08-25T14:10:34+05:30 IST