‘వి’ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది: ద‌ర్శ‌కుడు

ABN , First Publish Date - 2020-08-31T22:39:42+05:30 IST

2004లో ద‌ర్శ‌కుడిగా ‘గ్ర‌హ‌ణం’ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించిన డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి. 16 ఏళ్ల జ‌ర్నీలో ఈయ‌న తెర‌కెక్కించినవి ప‌ది చిత్రాలే. అయితే అన్ని సినిమాలు

‘వి’ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది: ద‌ర్శ‌కుడు

2004లో ద‌ర్శ‌కుడిగా ‘గ్ర‌హ‌ణం’ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించిన డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి. 16 ఏళ్ల జ‌ర్నీలో ఈయ‌న తెర‌కెక్కించినవి ప‌ది చిత్రాలే. అయితే అన్ని సినిమాలు దేనిక‌వే ప్ర‌త్యేక‌మైన‌వి. ప్ర‌స్తుతం మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘వి’. నేచుర‌ల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేదా థామ‌స్‌, అదితి రావు హైద‌రి ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించారు. అష్టాచ‌మ్మా, జెంటిల్‌మ‌న్ చిత్రాల త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ఇది. సెప్టెంబ‌ర్ 5న ‘వి’ చిత్రం విడుదలవుతుంది. ఈ సందర్భంగా డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు.


ఆయన మాట్లాడుతూ.. ‘‘ ‘వి’ సినిమాను ముందుగా థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఓటీటీలో విడుదలవుతుంది. సినిమాను ఓటీటీలో విడుద‌ల చేసే క్ర‌మంలో నేను, దిల్‌రాజుగారు, నాని స‌హా టీమ్‌తో చ‌ర్చించి ఓటీటీలో చేస్తేనే బెట‌ర్ అని అనుకున్నాం. ‘వి’ సినిమాను ఇప్ప‌టికే ఐదు నెల‌లుగా హోల్డ్ చేశాం. ప్రేక్ష‌కుల్లో కూడా సినిమా విడుద‌లపై ఆస‌క్తి నెల‌కొంది. ఇంకా థియేట‌ర్స్ ఓపెన్ చేసే విష‌యంలో క్లారిటీ లేదు. ఇంకా ప్రేక్ష‌కుల‌ను ఎగ్జ‌యిట్మెంట్‌‌తో హోల్డ్ చేయ‌డం మంచిది కాద‌ని ఆలోచించి నిర్ణ‌యించుకున్నాం. ఓ రకంగా థియేట‌ర్స్ కంటే ఓటీటీ వ‌ల్ల సినిమా 200 దేశాల్లో విడుద‌ల‌వుతుంది. అంద‌రికీ సినిమా చేరువ అవుతుంది. మొద‌టివారంలో సినిమా చూసేవాళ్లు మొద‌టి రోజునే సినిమా చూసే అవ‌కాశం క‌లిగింది. 


ఒక టెక్నీషియ‌న్‌గా నాకు సినిమాలను థియేట‌ర్స్‌లో చూడ‌టానికే ఇష్టం. ప్రేక్ష‌కులు కూడా అంతే. థియేట‌ర్స్ ఎక్స్‌పీరియెన్స్ డిఫ‌రెంట్. దీన్ని ఎవ‌రూ మిస్ చేసుకోవాల‌నుకోరు. అయితే ప్ర‌స్తుతం మ‌నం చూస్తున్న ప‌రిస్థితి చాలా ఇబ్బందిక‌ర‌మైన‌ద‌నే చెప్పాలి. ఇలాంటి సంద‌ర్భంలో మ‌న సినిమాల‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే మాధ‌మ్యం ఓటీటీ. డైరెక్ట‌ర్‌గా నేను ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల‌తో పోల్చితే స్టైల్ ప‌రంగా, స్కేల్ ప‌రంగా ‘వి’ నాకొక ఛాలెంజింగ్ మూవీ అనే చెప్పాలి. 5 రాష్ట్రాల‌తో పాటు థాయ్‌లాండ్‌లోనూ చిత్రీక‌రించాం. ఇంత‌కు ముందు నా సినిమాల‌ను నేనింతలా లావిష్‌గా చేయ‌లేదు. నేను తీసిన సినిమాల్లో నెక్స్ట్ రేంజ్ మూవీ అని చెప్పవచ్చు. ‘వి’ ఒక మిస్ట‌రీ యాక్ష‌న్ ఎమోష‌న‌ల్ డ్రామా. అంద‌రినీ మెప్పించేలా ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే అంద‌రికీ సీక్వెల్ ఉంటుంద‌నే అనుమానం వ‌స్తుంది. అయితే దీని సీక్వెల్ గురించి నేను ఆలోచించ‌లేదు..’’ అని తెలిపారు.

Updated Date - 2020-08-31T22:39:42+05:30 IST