అసలు పేరుని వాడేసుకుంటున్న మోహన్‌బాబు
ABN, First Publish Date - 2020-02-28T22:21:36+05:30
తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు డా.ఎం.మోహన్‌బాబు.
తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు డా.ఎం.మోహన్‌బాబు. ప్రస్తుతం ఈయన సూర్య హీరోగా నటిస్తోన్న ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సూర్య మార్గదర్శి పాత్రలో మోహన్‌బాబు కనపడబోతున్నారు. ఈ సినిమాలో ఆయన పేరు భక్తవత్సలం నాయుడు. ఆయన అసలు పేరుతోనే ఈ సినిమాలో కనపడనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ నెలలో విడుదలవుతున్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను కూడా మోహన్‌బాబు పూర్తి చేశారు. ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు ఆర్.గోపీనాథ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.