సాయిబాబా దయతో వారు కోలుకుంటారు: మోహన్ బాబు
ABN , First Publish Date - 2020-10-23T02:24:47+05:30 IST
కోవిడ్‌తో నాన్న పోరాటం కాస్త కష్టంగా మారిందని, ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ దయచేసి ప్రార్థనలు చేయండని హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక గురువారం ఉదయం

కోవిడ్‌తో నాన్న పోరాటం కాస్త కష్టంగా మారిందని, ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ దయచేసి ప్రార్థనలు చేయండని హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక గురువారం ఉదయం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. మళ్లీ వెంటనే ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్యం నిలకడగానే ఉందని, సీరియస్ అని ఫేక్ వార్తలు పుట్టించవద్దని ట్వీట్ చేసింది. ఆ తర్వాత సినీ నటుడు రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని సిటీ న్యూరో సెంటర్ అఫీషియల్‌గా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. అయితే ఈ విషయం తెలిసిన సినీ సెలబ్రిటీలందరూ రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ.. ఆయన కోసం ప్రార్థనలు చేస్తున్నట్లుగా ట్వీట్స్ చేస్తున్నారు. 'డియర్ శివాత్మిక.. మీ ప్రియమైన నాన్న, నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. మా అందరి ప్రార్థనలు, మద్దతు ఆయనకు, మీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటాయి. ధైర్యంగా ఉండండి.. ' అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేయగా.. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. రాజశేఖర్, జీవిత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లుగా ట్వీట్ చేశారు.
''నా సహనటులు మరియు స్నేహితులైన రాజశేఖర్ మరియు జీవితలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ సాయిబాబా దయతో వారు చక్కగా కోలుకుని.. మళ్లీ సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటారు.." అని మోహన్ బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Read more