అందరికీ అభివందనం: మోహన్ బాబు

ABN , First Publish Date - 2020-08-05T22:15:38+05:30 IST

శ్రీరామ చంద్రుడి జన్మస్థలం అయోధ్య నగరంలో రామ మందిరాన్ని నిర్మించే దిశలో తొలి అడుగు పడింది.

అందరికీ అభివందనం: మోహన్ బాబు

శ్రీరామ చంద్రుడి జన్మస్థలం అయోధ్య నగరంలో రామ మందిరాన్ని నిర్మించే దిశలో తొలి అడుగు పడింది. ఈ రోజు (బుధవారం) ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 


సీనియర్ నటుడు మోహన్ బాబు ట్విటర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రామ మందిర నిర్మాణానికి కారణమైన పుణ్యాత్ములందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. `అయోధ్య రాముడు ఆనందించేలా.. భారతదేశం గర్వించేలా.. ప్రపంచ చరిత్ర చెప్పుకునేలా.. ఎదురులేని తిరుగులేని మొక్కవోని సాహసంతో పుణ్యకారం తలపెట్టిన పుణ్యాత్ములందరికీ శతథా.. సహస్రథా.. వందనం.. అభివందనం` అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. 
Updated Date - 2020-08-05T22:15:38+05:30 IST