రజినీ రూ.45 లక్షలు ఇచ్చాడు: మోహన్ బాబు

ABN , First Publish Date - 2020-06-16T00:29:41+05:30 IST

సూపర్‌స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రాణ స్నేహితులనే సంగతి తెలిసిందే.

రజినీ రూ.45 లక్షలు ఇచ్చాడు: మోహన్ బాబు

సూపర్‌స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రాణ స్నేహితులనే సంగతి తెలిసిందే. మోహన్ బాబు నిర్మించిన `పెదరాయుడు` సినిమాలో రజినీకాంత్ ఒక్క రూపాయి పారితోషికం తీసుకోకుండా నటించారట. `పెదరాయుడు` విడుదలై పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా రజినీకాంత్ గురించి మోహన్ బాబు మాట్లాడారు. 


``పెదరాయుడు` షూటింగ్ తూర్పు గోదావరి జిల్లాలో చేశాం. రాజమండ్రిలో షూటింగ్ జరుగుతున్న సమయంలో నేను కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ విషయం రజినీకాంత్‌కు తెలిసింది. దీంతో అతను రాజమండ్రి వచ్చి రూ.45 లక్షలు ఇచ్చాడు. సినిమా విడుదలయ్యాకు తిరిగి ఇవ్వమని చెప్పాడు. అలాంటి మంచి స్నేహితుడు ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాన`ని మోహన్ బాబు చెప్పారు. 

Updated Date - 2020-06-16T00:29:41+05:30 IST