కొత్త సంవత్సరంలో సెట్స్‌పైకి మొఘల్‌

ABN , First Publish Date - 2020-11-06T09:54:26+05:30 IST

టీ సిరీస్‌ మ్యూజిక్‌ వ్యవస్థాపకుడు, నిర్మాత దివంగత గుల్షన్‌ కుమార్‌ బయోపిక్‌ ‘మొఘల్‌’ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఆమీర్‌ఖాన్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్నారు...

కొత్త సంవత్సరంలో సెట్స్‌పైకి మొఘల్‌

టీ సిరీస్‌ మ్యూజిక్‌ వ్యవస్థాపకుడు, నిర్మాత దివంగత గుల్షన్‌ కుమార్‌ బయోపిక్‌ ‘మొఘల్‌’ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఆమీర్‌ఖాన్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రకటించిన తరువాత పలు కారణాల వల్ల షూటింగు వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రం ఉంటుందా లేదా అనే సందేహాలకు చెక్‌ పెడుతూ ‘‘లాల్‌సింగ్‌ చద్దా’ షూటింగు పూర్తయిన తర్వాత ఆమీర్‌ఖాన్‌ ‘మొఘల్‌’ సెట్‌లోకి అడుగుపెట్టనున్నారు. కొత్త సంవత్సరంలో లేదావచ్చే ఏడాది మధ్యలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళుతుంది’’ అని టీ సిరీస్‌ అధిపతి భూషణ్‌కుమార్‌ తెలిపారు. ఆమీర్‌ఖాన్‌ ఈ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

Updated Date - 2020-11-06T09:54:26+05:30 IST