షూటింగ్‌లో కుప్పకూలిన మిథున్ చక్రవర్తి!

ABN , First Publish Date - 2020-12-21T19:34:23+05:30 IST

బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్‌ చక్రవర్తి అనారోగ్యానికి గురయ్యారు.

షూటింగ్‌లో కుప్పకూలిన మిథున్ చక్రవర్తి!

బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్‌  చక్రవర్తి అనారోగ్యానికి గురయ్యారు. కడుపు నొప్పి కారణంగా షూటింగ్‌ స్పాట్‌లోనే కుప్పకూలిపోయారు. మిథున్‌ చక్రవర్తి ప్రస్తుతం వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ది కశ్మీర్‌ ఫైల్స్` సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది. 


షూటింగ్ సమయంలో కడుపునొప్పి కారణంగా ఆరోగ్యం క్షీణించి మిథున్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో చిత్రీకరణను నిలిపివేశారు. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ విషయాన్ని తెలియజేశారు. భారీ యాక్షన్‌ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో మిథున్‌ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడని, ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణంగా కళ్లు తిరిగి పడిపోయాడని తెలిపారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మళ్లీ వచ్చి షూటింగ్‌లో పాల్గొన్నారని తెలిపారు.  

Updated Date - 2020-12-21T19:34:23+05:30 IST