వాస్తవ పరిస్థితులకు అద్దం

ABN , First Publish Date - 2020-12-22T06:19:16+05:30 IST

రంగా హీరోగా స్వీయ దర్శకత్వంలో శైలేష్‌ తివారి నిర్మించిన ‘బాలమిత్ర’ చిత్రం ట్రైలర్‌ను సీనియర్‌ హీరో అర్జున్‌ ఆవిష్కరించారు...

వాస్తవ పరిస్థితులకు అద్దం

రంగా హీరోగా స్వీయ దర్శకత్వంలో శైలేష్‌ తివారి నిర్మించిన ‘బాలమిత్ర’ చిత్రం ట్రైలర్‌ను సీనియర్‌ హీరో అర్జున్‌ ఆవిష్కరించారు. ‘ట్రైలర్‌ బాగుంది. నేటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంది. సినిమా టైటిల్‌ కూడా బాగుంది. చిత్రం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను’ అన్నారు. దర్శకనిర్మాత శైలేష్‌ తివారి మాట్లాడుతూ ‘ఎమోషన్‌, సస్పెన్స్‌ అంశాలు కలిగిన థ్రిల్లర్‌ ఇది. ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. త్వరలో విడుదల చేస్తాం’ అన్నారు. శశికళ, కియారెడ్డి, అనూష తదితరులు ఈ చిత్రంలో నటించారు.

Updated Date - 2020-12-22T06:19:16+05:30 IST