బీచ్‌లో న్యూడ్‌గా పరిగెత్తిన యాక్టర్
ABN , First Publish Date - 2020-11-04T23:21:27+05:30 IST
గోవా బీచ్‌లో ఉదయం నగ్నంగా పరిగెత్తాడు మిలింద్ సోమన్. ఆ ఫొటోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

55 ఏళ్లు అవుతున్నప్పటికీ మోడల్, యాక్టర్ మిలింద్ సోమన్ చాలా ఫిట్‌గా ఉన్నారు. ఆయన తన 55వ పుట్టినరోజుని సరికొత్తగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంతకూ అందులో కొత్తదనం ఏముందని అనుకుంటున్నారా? గోవా బీచ్‌లో ఉదయం నగ్నంగా పరిగెత్తాడు మిలింద్ సోమన్. ఆ ఫొటోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే.. ఈ ఫొటోను మిలింద్ సోమన్ సతీమణి అంకితా కోన్‌వార్ తీసింది. దీనిపై ఆయన ఫ్యాన్స్ కూడా స్పందిస్తున్నారు. సరదాగా మీమ్స్, జోక్స్ పోస్ట్ చేస్తున్నారు. యాబై ఐదేళ్ల వయసులోనూ ఐదేళ్ల పిల్లాడిగా కనిపిస్తున్నాడని కొందరు అంటున్నారు. అంకితా కోన్‌వార్ కూడా తన సోషల్ మీడియాలో మిలింద్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు.
Read more