భర్త రానాపై మిహీకా పొగడ్తలు

ABN , First Publish Date - 2020-11-13T05:05:49+05:30 IST

భళ్లాలదేవుడు రానా ఇటీవల తన బ్యాచ్‌లర్‌ లైఫ్‌కి శుభం కార్డు వేసిన విషయం తెలిసిందే. మిహీకా బజాజ్‌తో ప్రేమలో ఉన్న విషయం ఇంట్లో చెప్పిన నెలలోపే..

భర్త రానాపై మిహీకా పొగడ్తలు

భళ్లాలదేవుడు రానా ఇటీవల తన బ్యాచ్‌లర్‌ లైఫ్‌కి శుభం కార్డు వేసిన విషయం తెలిసిందే. మిహీకా బజాజ్‌తో ప్రేమలో ఉన్న విషయం ఇంట్లో చెప్పిన నెలలోపే.. వారి ప్రేమ.. పెళ్లిగా మారిపోవడం విశేషం. కరోనా టైమ్‌ కావడంతో.. దగ్గర బంధువుల సమక్షంలో వారు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మిహీకా పెద్దగా ఎక్కడా ఫోకస్‌ కాలేదు. ఇటీవల హనీమూన్‌లో ఉన్నప్పుడు మాత్రం ఒక ఫొటో షేర్‌ చేసింది. ఆ తర్వాత దసరా పండుగకి అత్తగారింట్లో ఉన్న రానా పక్కన దర్శనమిచ్చింది. తాజాగా తన భర్తను పొగుడుతూ.. ఇన్‌స్టాగ్రమ్‌లో మిహీకా ఓ పోస్ట్ చేసింది. 


ప్రస్తుతం రానా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ స్థాపించి.. వైఆర్‌యు అనే షోని నడిపించబోతున్నట్లుగా తెలిపారు. అందులో భాగంగా ఎందరో సెలబ్రిటీలను ఆయన ఈ షోకి తీసుకురానున్నారు. అందులో భాగంగా జరిగిందో.. లేక వేరే ఏదైనా ప్రమోషన్‌ కార్యక్రమో తెలియదు కానీ.. ది అండర్‌టేకర్‌ రెజ్లర్‌తో ఛాట్‌ అద్భుతంగా ఉందంటూ తెలుపుతూ ఓ ఫొటో షేర్‌ చేశారు. ఈ ఫొటోని షేర్‌ చేసిన మిహీకా.. నా భర్త కూలెస్ట్ అంటూ పోస్ట్ చేసింది. ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. Updated Date - 2020-11-13T05:05:49+05:30 IST