మిడిల్ క్లాస్ మెలోడీస్ నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల
ABN , First Publish Date - 2020-11-14T03:23:36+05:30 IST
ఆనంద్ దేవరకొండ మరియు వర్షా బొల్లమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మిడిల్ క్లాస్ మెలోడీస్'. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన 'గుంటూరు' సాంగ్ మంచి

ఆనంద్ దేవరకొండ మరియు వర్షా బొల్లమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మిడిల్ క్లాస్ మెలోడీస్'. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన 'గుంటూరు' సాంగ్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి 'సంధ్య' అనే స్వీట్ అండ్ రొమాంటిక్ ట్రాక్‌ను విడుదల చేశారు. ఈ పాటలో ఇద్దరు క్లాస్‌మేట్స్ మధ్య చిగురించే రొమాన్స్‌ని చాలా స్వీట్‌గా చూపించారు. ఉత్సాహభరితంగా సాగే ఈ పాటను స్వీకర్ అగస్తి స్వరపరిచి, ఆలపించగా.. సనపతి భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం అందించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని వినోద్ అనంతోజు డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం ఈ పండుగ సీజన్‌లో ప్రీమియర్ ప్రదర్శనకు సిద్దమయ్యింది. మిడిల్ క్లాస్ మెలోడీస్ అనేది కామెడీ డ్రామా, కలలు, నమ్మకాలు, పోరాటాలు మరియు ఆశలతో కూడిన పాత్రల చుట్టు తేలికపాటి అద్దం పట్టినట్టు ఉంటుందని, సినిమా చాలా బాగా వచ్చిందని చిత్రయూనిట్ తెలుపుతుంది. నవంబర్ 20న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.
'సంధ్య' పాట గురించి స్వరకర్త స్వీకర్ అగస్తి మాట్లాడుతూ.. ''ఒక యువ జంట మధ్య చిగురించే ప్రేమను చిత్రీకరించిన రొమాంటిక్ పాట ‘సంధ్య’. ఇది మీరు సాధారణంగా వినే సాఫ్ట్ లవ్ సాంగ్ కాదు, కానీ ఈ పాట చాలా పెప్పీ వైబ్ కలిగి ఉంది. ఈ పాట ద్వారా, మేము సరదా మరియు ఉత్సాహంతో కూడిన టీనేజ్ ప్రేమ యొక్క సారాన్ని సంక్లిప్తంగా చూపించడానికి ప్రయత్నించాము - మేము దానికి న్యాయం చేయగలిగామని ఆశిస్తున్నాము..". అని తెలిపారు.
Read more