మియా మాల్కొవాతో ఆర్‌జీవీ మరో మూవీ.. రేపే ‘క్లైమాక్స్’ టీజర్

ABN , First Publish Date - 2020-05-14T02:25:37+05:30 IST

అమెరికన్ పోర్న్‌స్టార్ మియా మాల్కొవాతో సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ‘గాడ్.. సెక్స్ అండ్ ట్రూత్’ అనే పేరుతో ఓ షార్ట్ ఫిలిమ్ చిత్రీకరించి.. అప్పట్లో తీవ్ర

మియా మాల్కొవాతో ఆర్‌జీవీ మరో మూవీ.. రేపే ‘క్లైమాక్స్’ టీజర్

అమెరికన్ పోర్న్‌స్టార్ మియా మాల్కొవాతో సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ‘గాడ్.. సెక్స్ అండ్ ట్రూత్’ అనే పేరుతో ఓ షార్ట్ ఫిలిమ్ చిత్రీకరించి.. అప్పట్లో తీవ్ర వివాదాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ.. తను అనుకున్న ప్రకారం వర్మ దాన్ని విడుదల చేశారు. 


అయితే ఇప్పుడు వర్మ మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. మియా మాల్కోవాతో చిత్రీకరించిన మరో సినిమా ‘క్లైమాక్స్’ టీజర్‌ని గురువారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్లు ఆర్‌జీవీ ప్రకటించారు. 


‘‘కరోనా ఇస్తున్న శాపాలు, లాక్‌డౌన్ నుంచి వచ్చిన ఆశీర్వాదాలతో రేపు సాయంత్రం నేను, మియా మాల్కొవా కలిసి మా చిత్రం క్లైమాక్స్ టీజర్‌ని 5 గంటలకు విడుదల చేస్తున్నాము’’ అని వర్మ పేర్కొన్నారు. శ్రేయస్ ఈటీ, ఆర్‌ఎస్‌ఆర్ ప్రొడక్షన్స్‌లో ఈ సినిమా తెరకెక్కినట్లు వర్మ తెలిపారు. 


అంతేకాక.. క్లైమాక్స్ అనేది ఓ థ్రిల్లర్ సినిమా అని.. ఈ సినిమాలో మియా మాల్కొవ నటన చూసి అంతా షాక్ అవుతారని వర్మ మరో ట్వీట్‌తో పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-14T02:25:37+05:30 IST