అభినందిస్తున్నారు: ‘మేకసూరి’ డైరెక్టర్ త్రినాథ్

ABN , First Publish Date - 2020-08-02T05:49:31+05:30 IST

‘‘ఎంతో కష్టపడితే గానీ... కొత్త దర్శకులకు అవకాశం రాదు. ఓటీటీ వల్ల పోటీ ఉన్నప్పటికీ... అవకాశాలు కాస్త సులభంగా వస్తున్నాయి. మూడేళ్ల తర్వాత ఓటీటీకి మంచి ఆదరణ వస్తుందనుకున్నా...

అభినందిస్తున్నారు: ‘మేకసూరి’ డైరెక్టర్ త్రినాథ్

‘‘ఎంతో కష్టపడితే గానీ... కొత్త దర్శకులకు అవకాశం రాదు. ఓటీటీ వల్ల పోటీ ఉన్నప్పటికీ... అవకాశాలు కాస్త సులభంగా వస్తున్నాయి. మూడేళ్ల తర్వాత ఓటీటీకి మంచి ఆదరణ వస్తుందనుకున్నా. కరోనా వల్ల ముందే వచ్చింది’’ అని త్రినాథ్‌ వెలిశిల అన్నారు. ‘జీ 5’ ఒరిజినల్‌ చిత్రం ‘మేక సూరి’తో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. జూలై 31న విడుదలైందీ సినిమా. ఈ సందర్భంగా ‘చిత్రజ్యోతి’తో త్రినాథ్‌ మాట్లాడుతూ ‘‘మాది విజయవాడ. చిన్నతనం నుంచి సినిమా అంటే ఆసక్తి. చిత్రసీమలో తొమ్మిదేళ్ల ప్రయాణంలో సినిమా అంటే ప్యాషన్‌ ఉన్నవాళ్లు మంచి దర్శకుడవుతాడని బలంగా నమ్మాను. నా ఎదురు చూపులకు తగ్గ ఫలితం ‘మేక సూరి’తో లభించినందుకు సంతోషంగా ఉంది. సినిమా చూసినవారంతా ‘చాలా బావుంది. తెలుగులో కొత్త ప్రయత్నం’ అని అభినందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సినిమాలో పాత్రలు, తీసిన విధానం గురించి మాట్లాడుతున్నారు. రెండేళ్ల క్రితం ప్రకాశం జిల్లా, సింగరాయకొండ పరిసర ప్రాంతాలకు వెళ్లినప్పుడు చూసిన వాస్తవ ఘటనల స్ఫూర్తితో ‘మేక సూరి’ కథ రాసుకున్నా. పల్లెటూళ్లలో మనుషులు ఎలా ఉంటారో, అదే విధంగా అంతే సహజంగా తెరకెక్కించాలని తీశాను. యాక్షన్‌ థ్రిల్లర్‌ కాబట్టి ‘రా అండ్‌ రియలిస్టిక్‌’గా తీశా. పార్ట్‌ 2 షూటింగ్‌ చాలావరకూ తీశా. మరికొంత బ్యాలెన్స్‌ ఉంది. త్వరలో పూర్తి చేస్తాం’’ అన్నారు.

Updated Date - 2020-08-02T05:49:31+05:30 IST