మంచి నిర్ణయం తీసుకున్న మెగాస్టార్ అల్లుడు

ABN , First Publish Date - 2020-07-03T01:44:10+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం తెలిసిన వారంతా చాలా మంచి నిర్ణయం అంటూ ఆయనను పొగడ్తలతో

మంచి నిర్ణయం తీసుకున్న మెగాస్టార్ అల్లుడు

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం తెలిసిన వారంతా చాలా మంచి నిర్ణయం అంటూ ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రీసెంట్‌గా కళ్యాణ్ దేవ్ ఆయన చేస్తున్న ‘సూపర్‌ మచ్చి’ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి నిరోధంలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేశాక ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవల రామానాయుడు స్టూడియోస్‌లో పునఃప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో షూటింగ్ మొత్తం పూర్తి చేయడమే కాకుండా, మిగిలి ఉన్న పాటల షూటింగ్ కూడా చేయాలని చిత్రయూనిట్ భావిస్తున్నారు.


అయితే రోజూ షూటింగ్‌లో పాల్గొంటున్న కళ్యాణ్ దేవ్, తన ఫ్యామిలీ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తనకి తానుగా స్వీయ నిర్భందం విధించుకున్నారు. బయట షూటింగ్‌లో పాల్గొని ఇంట్లోకి వెళ్లడం ప్రస్తుత పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదని భావించిన కళ్యాణ్ దేవ్, తన ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో స్వీయ నిర్భందం విధించుకున్నట్లుగా సమాచారం. షూటింగ్ పూర్తై, తనకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ముగిసే వరకు ఫ్యామిలీకి దూరంగా ఉండాలని కళ్యాణ్ దేవ్ భావిస్తున్నారట. కళ్యాణ్ దేవ్ తీసుకున్న ఈ డెసిషన్‌ని చాలా మంచి నిర్ణయం అంటూ ఇప్పుడందరు ప్రశంసిస్తున్నారు. 

Updated Date - 2020-07-03T01:44:10+05:30 IST