సోనూ.. అందుకు నీవు అర్హుడివి: చిరంజీవి

ABN , First Publish Date - 2020-12-21T02:00:59+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనూ, ఆ తర్వాత ఎంతో మంది ఆపన్నులకు అండగా నిలబడి రియల్ హీరో అనిపించుకున్న నటుడు సోనూసూద్‌. ఆయన ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి

సోనూ.. అందుకు నీవు అర్హుడివి: చిరంజీవి

కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనూ, ఆ తర్వాత ఎంతో మంది ఆపన్నులకు అండగా నిలబడి రియల్ హీరో అనిపించుకున్న నటుడు సోనూసూద్‌. ఆయన ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి 'ఆచార్య' చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి తన రీసెంట్‌ ఇంటర్వ్యూలో సోనూసూద్‌ మాట్లాడుతూ.. ''చిరంజీవి సర్‌.. ఆచార్య సినిమా యాక్షన్‌ సన్నివేశంలో నన్ను కొట్టడానికి ఇబ్బంది పడ్డారు. ఆ విషయాన్ని ఆయనే చెప్పారు. కోవిడ్‌ సమయంలో ఎంతో చేసి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నావు. నిన్ను కొడితే ప్రేక్షకులు నాపై కోపం పెంచుకుంటారు" అని అన్నారు. అలాగే ఆయన తాజా ట్వీట్‌లో.. ''ఇప్పటి వరకు నేను పనిచేసిన వారిలో వినయం, గొప్ప మనసున్న నటులు నిస్సందేహంగా చిరంజీవిగారే అని చెప్పగలను. లవ్ యు చిరు సర్.." అని తెలిపారు.


సోనూసూద్‌ ట్వీట్‌ని రీ ట్వీట్‌ చేసిన చిరు.. ''సోనూసూద్‌..మీకు ధన్యవాదాలు. మీరు గొప్ప మానవత్వం కలిగిన వ్యక్తులు. నిరుపేదలకు, అవసరార్థులకు గొప్ప మనసుతో మీరు చేసే సహాయ కార్యక్రమాలు ఇలాగే కొనసాగించి.. అందరిలో స్పూర్తి నింపండి. మీకు మరింత శక్తిని ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ బంగారు హృదయానికి అన్ని గుర్తింపులు అర్హమైనవే.." అని తెలిపారు.Updated Date - 2020-12-21T02:00:59+05:30 IST