మెగా బ్రదర్‌ని సర్‌ప్రైజ్‌ చేసిన మెగాస్టార్‌

ABN , First Publish Date - 2020-10-30T02:41:24+05:30 IST

మెగాబ్రదర్‌ నాగబాబు పుట్టినరోజు అక్టోబర్‌ 29 (గురువారం). ఈ సందర్భంగా నాగబాబు అన్నయ్య, మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు

మెగా బ్రదర్‌ని సర్‌ప్రైజ్‌ చేసిన మెగాస్టార్‌

మెగాబ్రదర్‌ నాగబాబు పుట్టినరోజు అక్టోబర్‌ 29 (గురువారం). ఈ సందర్భంగా నాగబాబు అన్నయ్య, మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'విధేయుడు, ఎమోషనల్‌ పర్సన్‌, దయగల హృదయమున్న వ్యక్తే కాదు.. చాలా సరదాగా ఉండే వ్యక్తి, నా సోదరుడు నాగబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని, నీ ప్రతి పుట్టినరోజుకి అది మరింత బలపడాలని ఆశిస్తున్నాను!..' అని ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌లో నాగబాబు రెండోసారి ప్లాస్మా దానం చేస్తున్నారని తెలిసి.. వెంటనే అక్కడికి చేరుకుని నాగబాబు పుట్టినరోజు వేడుకలను జరిపారు.


''చిరంజీవి నుంచి ఊహించని ఈ సర్‌ప్రైజ్‌ గురించి నాగబాబు తన ఇన్‌స్టాగ్రమ్‌ వేదికగా పంచుకున్నారు. ''నా అన్నయ్య చిరంజీవిని నా ఫిలాసఫర్‌గా కలిగి ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మానవత్వంతో.. మెరుగైన సమాజం కోసం ఆయన చేసే పనుల్లో నేను కూడా భాగం అయినందుకు గర్వపడుతున్నాను. చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌లో నేను రెండోసారి ప్లాస్మా దానం చేస్తున్నానని తెలిసి.. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సడెన్‌గా వచ్చి సర్‌ప్రైజ్‌ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది.  అన్నయ్యా దీనికి ఎంతగానో సంతోషిస్తూ.. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పటికీ మీతోనే ఉంటానని మాటిస్తున్నాను.. '' అని నాగబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. Updated Date - 2020-10-30T02:41:24+05:30 IST