మనవరాలి మెస్మరైజింగ్‌ వీడియో షేర్ చేసిన చిరు

ABN , First Publish Date - 2020-10-09T01:17:48+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవికి ఏదైనా నచ్చితే.. వెంటనే సోషల్‌ మీడియా ద్వారా ఆ విషయాన్ని తెలియజేస్తూ.. ఆ విషయానికి కారణమైన వారికి అభినందనలు

మనవరాలి మెస్మరైజింగ్‌ వీడియో షేర్ చేసిన చిరు

మెగాస్టార్‌ చిరంజీవికి ఏదైనా నచ్చితే.. వెంటనే సోషల్‌ మీడియా ద్వారా ఆ విషయాన్ని తెలియజేస్తూ.. ఆ విషయానికి కారణమైన వారికి అభినందనలు తెలియజేస్తూ ఉంటారు. కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో ఓ లేడీ పోలీస్‌ ఆఫీసర్‌.. రోడ్డు మీద మతిస్థిమితం లేని ఓ అనాథను.. ఆప్యాయతగా దగ్గరకు తీసుకుని అన్నం పెట్టిన వీడియో చూసి చలించిపోయిన చిరు వెంటనే ఆమె నెంబర్‌ కనుక్కొని మరీ అభినందించారు. అలానే ఇప్పుడు చిన్నపిల్లలలో ఉండే అభిరుచి, టాలెంట్‌ను గుర్తించి వారు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే.. వారు మరింత ఉత్తేజితులవుతారని తెలుపుతూ.. ఓ మెస్మరైజింగ్‌ వీడియోని చిరు షేర్‌ చేశారు. 


ఈ వీడియోలో ఉన్నది మరెవరో కాదు.. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కూతురు సంహిత. రాణీ రుద్రమదేవి అవతారంలో ఆమె చెప్పిన డైలాగ్‌ చెబుతూ.. సంహిత పలికిన పలుకులకు చిరంజీవి ఎంతో మురిసిపోయినట్లుగా తెలుపుతూ ఈ వీడియోని షేర్‌ చేశారు. అంతే కాదు 1990లో తన కూతురు సుస్మిత కూడా రాణీ రుద్రమ్మ అవతారం ధరించిందని.. ఇప్పుడు సంహిత ఆ పరంపరను కొనసాగిస్తున్నట్లుగా మెగాస్టార్‌ చిరంజీవి చెప్పుకొచ్చారు. చివరిగా తన మనవరాలి అభినయానికి మురిసిపోయిన చిరు.. వావ్‌ సంహి అంటూ.. ముద్దుల వర్షం కురిపించారు. 

Updated Date - 2020-10-09T01:17:48+05:30 IST