లాక్‌డౌన్‌లో రామ్ చరణ్ లుక్ చూశారా?

ABN , First Publish Date - 2020-07-03T03:52:02+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌తో సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు ఈ లాక్‌డౌన్‌లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెడితే, మరికొందరు వంటలపై

లాక్‌డౌన్‌లో రామ్ చరణ్ లుక్ చూశారా?

కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌తో సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు ఈ లాక్‌డౌన్‌లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెడితే, మరికొందరు వంటలపై ఇలా ఏదో రకంగా లాక్‌డౌన్‌ను ముగించారు. ఇది అందరికీ కొత్త అనుభవాన్ని నేర్పింది. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ లాక్‌డౌన్‌లో ఎలా తయారయ్యారో చూస్తే ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం ఆయన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో అల్లూరి సీతారామరాజు పాత్రను చరణ్ పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఆయన లుక్‌కు సంబంధించి ఓ టీజర్ విడుదలైంది. అందులో చరణ్ కండలతో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఇప్పుడు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతున్న వీడియోని జానీ మాస్టర్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.


ఈ వీడియోలో జానీ మాస్టర్ గురించి చెబుతూ.. త్వరలోనే అందరం మళ్లీ కలిసి పని చేసుకునే రోజులు వస్తాయని, ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండమని ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు చరణ్. అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు పక్కన పెడితే ఈ వీడియోలో ఆయన లుక్ మాత్రం.. ఈ లాక్‌డౌన్‌లో ఆయన ఎంత కష్టపడిందీ తెలుపుతుంది. గుబురు గడ్డంతో పాటు బాగా హెయిర్ పెరిగి.. రఫ్ లుక్‌లో దర్శనమిస్తున్నారు. అలాగే డైట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించినట్లుగా అర్థమవుతుంది. మొత్తంగా చూస్తే రామ్ చరణ్ సినిమా కోసం ఎంత కష్టపడతాడో అనేది ఈ వీడియోలో ఉన్న ఆయన లుక్ చూస్తుంటే తెలుస్తుంది.Updated Date - 2020-07-03T03:52:02+05:30 IST