గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మెగా బ్రదర్‌

ABN , First Publish Date - 2020-09-08T02:44:09+05:30 IST

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహాఉద్యమంలా ముందుకు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మెగా బ్రదర్‌

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహాఉద్యమంలా ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు.. ఇలా ఒక్కరేమిటి.. ప్రతి ఒక్కరూ ఇందులో భాగమవుతూ.. మొక్కలు నాటుతున్నారు. మొక్కలు నాటడమే కాకుండా.. మరి కొందరిని ఇందులో భాగం చేస్తున్నారు. తాజాగా కమెడియన్‌ చమ్మక్‌ చంద్ర ఇచ్చిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించారు మెగా బ్రదర్‌ నాగబాబు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా మణికొండలోని తన నివాసంలో ఆయన మొక్కలు నాటారు.


ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా గొప్ప విషయం. చాలా సంతోషంగా ఉంది. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నేనూ భాగమవ్వడం చాలా ఆనందంగా ఉంది. నన్ను ఈ ఛాలెంజ్‌కు నామినేట్‌ చేసిన చమ్మక్ చంద్రకు, అలాగే ఈ గొప్ప కార్యక్రమంతో అందరిలో స్ఫూర్తి నింపుతున్న సంతోష్‌ కుమార్‌గారికి ధన్యవాదాలు. ఈ ఛాలెంజ్‌కు భరణి, కళికి రాజులను నామినేట్‌ చేస్తున్నాను. సాధ్యమైన వరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరుతున్నాను.. అని తెలిపారు.

Updated Date - 2020-09-08T02:44:09+05:30 IST