త్రిష వీడియో బ‌య‌ట‌పెడ‌తానంటున్న న‌టి

ABN , First Publish Date - 2020-07-28T19:19:02+05:30 IST

హీరోయిన్ త్రిష‌కు, న‌టి మీరా మిథున్‌కు మ‌ధ్య గొడ‌వ‌లు ఇప్ప‌ట్లో స‌మ‌సిపోయేలా లేవు

త్రిష వీడియో బ‌య‌ట‌పెడ‌తానంటున్న న‌టి

హీరోయిన్ త్రిష‌కు, న‌టి మీరా మిథున్‌కు మ‌ధ్య గొడ‌వ‌లు ఇప్ప‌ట్లో స‌మ‌సిపోయేలా లేవు. త‌న‌కు అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా మీరా మిథున్ ఏదో ఒక రూపంలో త్రిష‌ను కామెంట్ చేస్తుంది. త‌మిళ బిగ్‌బాస్‌లో సీజ‌న్ 3 కంటెస్టెంట్‌గానూ మీరా మిథున్ పాల్గొన్నారు. త్రిష‌కు కోలీవుడ్ మాఫియాతో సంబంధాలున్నాయ‌ని, నెపోటిజంకు మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని మీరా మిథున్ కామెంట్స్ చేస్తుంది. చిన్న చిన్న పాత్ర‌లు చేసి త‌ర్వాత హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న త్రిష త‌న‌కు న‌టిగా అవ‌కాశాలు లేకుండా చేస్తుంద‌ని మీరా మిథున్ కామెంట్స్ చేసింది. రీసెంట్‌గా త్రిష‌కు సంబంధించిన వీడియో ఒక‌టి విడుద‌ల చేస్తాన‌ని మీరా మిథున్ ట్విట్ట‌ర్‌లో చెప్ప‌డం హాట్ టాపిక్‌గా మారింది. Updated Date - 2020-07-28T19:19:02+05:30 IST