‘ఈగో ఉన్న ఐదు పాత్రలు కలిస్తే ఏమవుతుందో చెప్పే సినిమా’

ABN , First Publish Date - 2020-02-08T02:34:13+05:30 IST

సినీ రాజకీయల సమక్షంలో ‘డబ్లూడబ్లూడబ్లూడాట్ మీనా బజార్.,’ ఆడియో విడుదల కార్యక్రమం ఫిబ్రవరి 6న హైదరాబాద్‌లో

‘ఈగో ఉన్న ఐదు పాత్రలు కలిస్తే ఏమవుతుందో చెప్పే సినిమా’

సినీ రాజకీయల సమక్షంలో ‘డబ్లూడబ్లూడబ్లూడాట్ మీనా బజార్.,’ ఆడియో విడుదల కార్యక్రమం ఫిబ్రవరి 6న హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు నటి దివ్యవాణి, హేమ, నక్కిన త్రినాధ్ రావు, నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటి హేమ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ చూసిన తరువాత మంచి మెసేజ్‌తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. వర్మ, పూరి స్టైల్‌లో ఈ సినిమా ఉండబోతోందని అనుకుంటున్నాను. మాస్ మసాలా కోరుకునే ఆడియన్స్‌కు ఈ సినిమా బాగా నచ్చుతుందనుకుంటున్నాను.. అన్నారు. 


డైరెక్టర్ మరియు నిర్మాత అయిన రానా సునీల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. మీనా బజార్ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే ఆడియన్స్‌కు కొన్ని డౌట్స్ రావాలని అనుకున్నాను, వచ్చాయి. వాటికి సమాధానం సినిమా చూస్తే తెలుస్తుంది. బజారులో అమ్మేవారు, కొనేవారు మాత్రమే ఉంటారు, అలా ఒక ఐదు ప్రధాన పాత్రలను బేస్ చేసుకొని ఈ కథ రాయడం జరిగింది. ప్రతి మనిషిలో ఈగో ఉంటుంది, అలా ఈగో ఉన్న ఐదు పాత్రలు కలిస్తే ఏమవుతుందో అనేదే ఈ సినిమా. ఈ మూవీ క్లైమాక్స్ వరకు ఒక జర్నీ ఉంటుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది గెస్ చేయలేము, ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు. తప్పకుండా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని భావిస్తున్నాను.. అన్నారు.

Updated Date - 2020-02-08T02:34:13+05:30 IST