మెడికల్‌ థ్రిల్లర్‌

ABN , First Publish Date - 2020-05-04T06:56:32+05:30 IST

‘ఇప్పటివరకూ ప్రపంచ సినిమాలో రానటువంటి విభిన్నమైన కథతో ‘ఏ’ సినిమా నిర్మించాం. మెడికల్‌ థ్రిల్లర్‌ ఇది. 1977- 2019 మధ్య కాలంలో జరిగే కథ ఇది...

మెడికల్‌ థ్రిల్లర్‌

‘ఇప్పటివరకూ ప్రపంచ సినిమాలో రానటువంటి విభిన్నమైన కథతో ‘ఏ’ సినిమా నిర్మించాం. మెడికల్‌ థ్రిల్లర్‌ ఇది. 1977- 2019 మధ్య కాలంలో జరిగే కథ ఇది. నాతో సహా టెక్నీషియన్లు అందరూ ఫిల్మ్‌ స్కూల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ నుంచి వచ్చినవారే. సినిమా అద్భుతంగా వచ్చింది. అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యం సినిమాకు పెద్ద ఎస్సెట్‌ అవుతుంది’ అని దర్శకుడు యుగంధర్‌ ముని చెప్పారు. న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో ఆయన శిక్షణ పొందారు. థ్రిల్లర్‌ జోనర్‌ ప్రేక్షకులకు ఈ చిత్రం కొత్త అనుభూతి కలిగిస్తుందనీ, శంషాబాద్‌ సమీపంలో సెట్‌ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించామనీ యుగంధర్‌ చెప్పారు. ‘ఏ’ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకొంది. నితిన్‌ ప్రసన్న , ప్రీతీ ఆస్రాని, బేబీ దీవెన, రంగధామ్‌, కృష్ణవేణి, భరద్వాజ్‌ తదితరులు ఈ చిత్రంలో నటించారు.

Updated Date - 2020-05-04T06:56:32+05:30 IST