అధీరా ముఖంపై టాట్టూకు అర్థమదేనా..?

ABN , First Publish Date - 2020-08-02T20:30:00+05:30 IST

ప్యాన్ ఇండియా మూవీగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న చిత్రాల్లో ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’ ఒక‌టి. రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ అధీరా అనే విల‌న్ పాత్ర‌లో నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

అధీరా ముఖంపై టాట్టూకు అర్థమదేనా..?

ప్యాన్ ఇండియా మూవీగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న చిత్రాల్లో ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’ ఒక‌టి. రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ అధీరా అనే విల‌న్ పాత్ర‌లో నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా సంజ‌య్ ద‌త్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమాలోని సంజ‌య్ ద‌త్ అధీరా లుక్‌ను ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’ యూనిట్ విడుద‌ల చేసింది. ఈ లుక్‌లో సంజ‌య్ ద‌త్ ముఖంపై ఓ ప‌చ్చ‌బొట్టు ఉంది. అస‌లు ఆ ప‌చ్చ‌బొట్టుకు అర్థ‌మేంటి?  అని చాలా మంది ఆలోచించారు. తాజాగా సోష‌ల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తొక‌టి హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అదేంటంటే.. సంజ‌య్ ద‌త్ ముఖంపై ఉన్న టాట్టూ సంస్కృత భాష‌లో ఉంది. ‘జాలి, దయ నా నుండి ఆశించకండి. నేను మృత్యువుకు జ‌న్మ‌స్థ‌లాన్ని, యుద్ధం ఒక‌టే ఈ ప్ర‌పంచానికి శ‌ర‌ణ్యం’ అనేదే ఈ టాట్టూ అర్థ‌మ‌ని అంటున్నారు కొంద‌రు. ‘కె..జి.య‌ఫ్ చాప్ట‌ర్ 1’ భారీ విజ‌యం సాధించ‌డంతో రెండో భాగంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్ర‌శాంత్ నీల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. 

Updated Date - 2020-08-02T20:30:00+05:30 IST