మాయ... అంతా మేకప్‌ మాయ!

ABN , First Publish Date - 2020-09-16T06:42:05+05:30 IST

నున్నగా గీసిన గుండు... నల్లటి కళ్లద్దాలు... కొంచెం పెరిగిన గడ్డం, మీసం... ఇటీవల ‘అర్బన్‌ మాంక్‌’ లుక్‌లో చిరంజీవి అందర్నీ ఆశ్చర్యపరిచారు...

మాయ... అంతా మేకప్‌ మాయ!

నున్నగా గీసిన గుండు... నల్లటి కళ్లద్దాలు... కొంచెం పెరిగిన గడ్డం, మీసం... ఇటీవల ‘అర్బన్‌ మాంక్‌’ లుక్‌లో చిరంజీవి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆయన ఎప్పుడు గుండు చేయించుకున్నారు? లేదంటే టెక్నాలజీ సాయంతో ఆ లుక్‌లోకి మారారా? ప్రేక్షకుల మదిలో ఎన్నో ప్రశ్నలు! లుక్‌ చూస్తే గుండు గీయించుకున్నట్టుందని అభిమానుల్లో ఆశ్చర్యం! అయితే... అదంతా మాయ! మేకప్‌ మాయ!! అర్బన్‌ మాంక్‌ లుక్‌ వెనుక కథను మంగళవారం చిరంజీవి చెప్పారు. ‘మేకింగ్‌ ఆఫ్‌ అర్బన్‌ మాంక్‌’ అంటూ ఆ లుక్‌లో ఎలా మారిందీ వీడియో రూపంలో చూపించారు. సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియో చూడవచ్చు. అది చూసి అసలు సంగతి తెలుసుకున్నవాళ్లు మరింత ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నారు. దాని తర్వాత దర్శకులు వి.వి. వినాయక్‌, మెహర్‌ రమేశ్‌, కె.ఎస్‌. రవీంద్ర (బాబీ)తో చిత్రాలు చేయనున్నారు. వీళ్లల్లో ఎవరో ఒకరి చిత్రంలో చిరంజీవి అర్బన్‌ మాంక్‌ లుక్‌లో కనిపించనున్నారని సమాచారం.Updated Date - 2020-09-16T06:42:05+05:30 IST