`ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` డైరెక్టర్ మరో సినిమా!

ABN , First Publish Date - 2020-09-08T17:02:01+05:30 IST

తొలి సినిమా `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`తో దర్శకుడు స్వరూప్ టాలీవుడ్ దృష్టిని ఆకట్టుకున్నాడు.

`ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` డైరెక్టర్ మరో సినిమా!

తొలి సినిమా `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`తో  దర్శకుడు స్వరూప్ టాలీవుడ్ దృష్టిని ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో స్వరూప్ రెండో సినిమా గురించి ఆసక్తి పెరిగింది. తాజాగా ఆ సినిమా గురించి ప్రకటన వచ్చింది.


ప్రస్తుతం చిరంజీవితో `ఆచార్య`, నాగార్జునతో `వైల్డ్‌డాగ్` చిత్రాలను నిర్మిస్తున్న మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ స్వరూప్ రెండో సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం మరో ఆసక్తికర సబ్జెక్టును స్వరూప్ సిద్ధం చేసుకున్నాడట. ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ నుంచి సెట్స్ మీదుకు వెళ్లబోతోంది. ఈ సినిమా నటీనటుల వివరాలు త్వరలోనే బయటకు రాబోతున్నాయి.  

Updated Date - 2020-09-08T17:02:01+05:30 IST