`మాస్టర్` వచ్చేస్తున్నాడు!

ABN , First Publish Date - 2020-12-29T19:53:44+05:30 IST

తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ నటించిన తాజా చిత్రం `మాస్టర్`.

`మాస్టర్` వచ్చేస్తున్నాడు!

తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ నటించిన తాజా చిత్రం `మాస్టర్`. `ఖైదీ` ఫేమ్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాళవికా మోహనన్ కథానాయిక. ప్రముఖ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు.


తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన అప్‌డేట్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈ సినిమా విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు. మొత్తం నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో విజయ్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. 

Updated Date - 2020-12-29T19:53:44+05:30 IST