భారీ యాక్షన్‌ చిత్రం

ABN , First Publish Date - 2020-07-28T05:38:03+05:30 IST

ప్రతిభావంతులైన యువ దర్శకులను ప్రోత్సహించడంలో అక్కినేని నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. కథ నచ్చితే కొత్త దర్శకులకూ ఆయన అవకాశాలు ఇస్తుంటారు...

భారీ యాక్షన్‌ చిత్రం

ప్రతిభావంతులైన యువ దర్శకులను ప్రోత్సహించడంలో అక్కినేని నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. కథ నచ్చితే కొత్త దర్శకులకూ ఆయన అవకాశాలు ఇస్తుంటారు. ‘చందమామ కథలు’, ‘గుంటూరు టాకీస్‌’, ‘పీఎస్వీ గరుడవేగ’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ఓ చిత్రం చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నారాయణ దాస్‌ కె. నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ ఈ చిత్రం నిర్మించనున్నారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: ప్రవీణ్‌ సత్తారు.

Updated Date - 2020-07-28T05:38:03+05:30 IST