తెలుగు భాషా దినోత్సవంపై మారుతి ట్వీట్ వైరల్

ABN , First Publish Date - 2020-08-31T02:36:29+05:30 IST

ఆగస్ట్ 29.. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సెలబ్రిటీలు చాలా మంది సోషల్ మీడియాలో తెలుగు భాష గొప్పదనంపై ట్వీట్స్ చేశారు. ముఖ్యంగా సినీ

తెలుగు భాషా దినోత్సవంపై మారుతి ట్వీట్ వైరల్

ఆగస్ట్ 29.. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సెలబ్రిటీలు చాలా మంది సోషల్ మీడియాలో తెలుగు భాష గొప్పదనంపై ట్వీట్స్ చేశారు. ముఖ్యంగా సినీ దర్శకులు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్స్ వైరల్ అయ్యాయి. హరీష్ శంకర్ చేసిన ట్వీట్ గురించి ఇప్పటికే చెప్పుకుని ఉన్నాం. మరో యంగ్ దర్శకుడు మారుతి చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంతకీ మారుతి ఏం ట్వీట్ చేశాడంటే..

‘‘షేక్‌స్పియర్ గొప్పోడే, కానీ నాకు సీతారామ శాస్త్రే దేవుడు.

అవేంజర్స్ అద్భుతమే, కానీ నాకు బాహుబలే బ్రహ్మాండం.

విల్ స్మిత్ తోపే, కానీ నాకు చిరంజీవే హీరో. 

ఇంగ్లీష్ ఇష్టమే, కానీ తెలుగంటే మాత్రం ప్రాణం.

తెలుగు వారందరికీ.. తెలుగుభాషాదినోత్సవశుభాకాంక్షలు’’. మారుతి చేసిన ఈ ట్వీట్‌తో తెలుగు భాషా ప్రియులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. చాలా బాగా చెప్పారు మారుతిగారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.Updated Date - 2020-08-31T02:36:29+05:30 IST