మారుతి కుమార్తెకు హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అభినందనలు

ABN , First Publish Date - 2020-06-05T21:09:46+05:30 IST

దర్శకుడు మారుతి కుమార్తె హియాకు అరుదైన అభినందన లభించింది. హియా తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో హియా ఫోటోగ్రఫీ పేరిట తాను తీసిన వివిధ ఫోటోలను

మారుతి కుమార్తెకు హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అభినందనలు

దర్శకుడు మారుతి కుమార్తె హియాకు అరుదైన అభినందన లభించింది. హియా తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో హియా ఫోటోగ్రఫీ పేరిట తాను తీసిన వివిధ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా హియా షేర్ చేసిన కొన్ని అద్భుతమైన ఫొటోలకు హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డ్యాన్ లాస్సేన్ లైక్ చేసి, హియాను ప్రత్యేకంగా అభినందించారు. 


డ్యాన్ సినిమాటోగ్రఫీ అందించిన సినిమాల్లో ‘జూన్ విక్ 2, ది షేప్ ఆఫ్ వాటర్’ వంటి వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. హియా ఈ ఫోటోలను సోనీ ఏ6600 కెమెరాతో గాడ్ ఎక్స్ ఫ్లాష్ ఉపయోగించి తీశారు. ఇక హియా తాజాగా మారుతీ డైరెక్ట్ చేసిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో హీరోయిన్ రాశి ఖన్నా చెల్లెలుగా నటించింది. హియా చదువుతో పాటు డాన్స్, ఫొటోగ్రఫీ, డ్రాయింగ్ వంటి కలల్లో శిక్షణ పొందుతుంది.

Updated Date - 2020-06-05T21:09:46+05:30 IST