ప్రముఖ నటుడు ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-07-30T15:58:31+05:30
ప్రముఖ మరాఠీ నటుడు అశుతోష్ భాక్రే(32) ఆత్మహత్య చేసుకున్నారు. అశుతోష్ మహారాష్ట్రలోని నాందేడ్‌లోని తన ఇంట్లో ఉరి వేసుకున్నారు.
ప్రముఖ మరాఠీ నటుడు అశుతోష్ భాక్రే(32) ఆత్మహత్య చేసుకున్నారు. అశుతోష్ మహారాష్ట్రలోని నాందేడ్‌లోని తన ఇంట్లో ఉరి వేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అశుతోష్ మృతదేహం నాందేడ్‌లోని అతని ఇంట్లో వేలాడుతూ కనిపించింది. అశుతోష్ నెల్లాళ్ల క్రితం నాందేడ్ వచ్చారు. అశుతోష్ మరణంతో మరాఠీ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. అశుతోష్ ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సినిమా, టీవీ నటి మయూరి దేశ్‌ముఖ్‌ను 2016, జనవరి 21న అశుతోష్ వివాహం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ తమ ఇంటికి వచ్చారు. అశుతోష్ మరాఠీ చిత్ర పరిశ్రమలో ఎంతో పేరుపొందారు. ఎచార్ తార్లా పక్కా అనే సినిమాతో అశుతోష్‌కు ఎంతో పేరు వచ్చింది. బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి నుంచి అభిమానులు కోలుకుంటున్న తరుణంలో అశుతోష్ ఆత్మహత్య మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.