'బాహుబలి' స్ఫూర్తితోనే....

ABN , First Publish Date - 2020-10-09T20:09:43+05:30 IST

ప్రియాంక చోప్రా తర్వాత మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని దక్కించుకున్న మానుషి చిల్లర్‌ బాలీవుడ్ చిత్రం పృథ్వీరాజ్‌లో నటిస్తుంది. అక్షయ్‌ కుమార్‌ నటించనున్న ఈ చిత్రంలో నటించడానికి కారణం దర్శకధీరుడు రాజమౌళియే కారణమని చెబుతోంది మానుషి చిల్లర్‌.

'బాహుబలి' స్ఫూర్తితోనే....

ప్రియాంక చోప్రా తర్వాత మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని దక్కించుకున్న మానుషి చిల్లర్‌ బాలీవుడ్ చిత్రం 'పృథ్వీరాజ్‌'లో నటిస్తుంది. అక్షయ్‌ కుమార్‌ నటించనున్న ఈ చిత్రంలో నటించడానికి కారణం దర్శకధీరుడు రాజమౌళియే కారణమని చెబుతోంది మానుషి చిల్లర్‌. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. చంద్ర ప్రకాశ్‌ ద్వివేది దర్శకత్వం వహిస్తున్నారు. భారీ పీరియాడికల్‌ మూవీలో నటించడం ఎలా ఉందని మానుషిచిల్లర్‌ను అడిగితే రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమాను చూసి ఎంతో స్ఫూర్తి పొందానని, అలాంటి భారీ చిత్రంలో నటించాలని అనుకుంటున్న సమయంలో పృథ్వీరాజ్‌ సినిమాలో నటించే అవకాశం దక్కిందని అన్నారు. రాజమౌళి ఎన్నో ఐకానిక్‌ చిత్రాలను రూపొందించారని, తనకు వీలున్నప్పుడల్లా రాజమౌళి సినిమాలను చూస్తుంటానని, ఆయన సినిమాల్లో మహిళా పాత్రలు చాలా శక్తివంతంగా ఉంటాయని తెలిపారు మానుషి చిల్లర్‌. 


Updated Date - 2020-10-09T20:09:43+05:30 IST