మనోజ్‌ పాన్‌ ఇండియా సినిమా

ABN , First Publish Date - 2020-02-14T08:57:47+05:30 IST

దాదాపు మూడేళ్ల తర్వాత మనోజ్‌ వెండితెరపై సందడి చేయనున్నారు. ఇటీవల ‘ఓ ఆసక్తికర విషయం అభిమానులతో పంచుకుంటాను’ అని ట్వీట్‌ చేసిన మనోజ్‌, తన తాజాగా చిత్రానికి...

మనోజ్‌ పాన్‌  ఇండియా సినిమా

దాదాపు మూడేళ్ల తర్వాత మనోజ్‌ వెండితెరపై సందడి చేయనున్నారు. ఇటీవల ‘ఓ ఆసక్తికర విషయం అభిమానులతో పంచుకుంటాను’ అని ట్వీట్‌ చేసిన మనోజ్‌, తన తాజాగా చిత్రానికి సంబంధించిన వివరాల్ని వెల్లడించారు. ఆయన హీరోగా శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా చేస్తున్నట్లు మనోజ్‌ తెలిపారు. సినిమా టైటిల్‌ పోస్టర్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. మార్చి 6న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందీ సినిమా. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా సినిమాగా ఈ చిత్రం రూపొందనుంది. విద్యా నిర్వాణ, మంచు ఆనంద్‌ సమర్పణలో ఎం.ఎం ఆర్ట్స్‌ బ్యానర్‌పై మంచు మనోజ్‌, నిర్మలాదేవి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘మూడేళ్ల తర్వాత మీ ముందుకొస్తున్నా. నా తొలి చిత్రం ‘దొంగ దొంగది’ సమయంలో ఎలాంటి ఉద్వేగంగా ఉన్నానో.. ఇప్పుడూ అలాగే ఉన్నా. నాకు జీవితం అయిన కళను ఇంతకాలం మిస్సయ్యాను. సినీ అమ్మా వచ్చేశా’’ అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు మనోజ్‌.


Updated Date - 2020-02-14T08:57:47+05:30 IST