మణిరత్నం చిన్మయి

ABN , First Publish Date - 2020-10-30T07:21:07+05:30 IST

సినీపరిశ్రమలో మహిళలపై వేధింపులకు పాల్పడిన కొందరు ప్రముఖులపైన గాయని చిన్మయి ‘మీటూ’ విమర్శలతో వార్తల్లో నిలిచిన విషయం...

మణిరత్నం  చిన్మయి

సినీపరిశ్రమలో మహిళలపై వేధింపులకు పాల్పడిన కొందరు ప్రముఖులపైన గాయని చిన్మయి ‘మీటూ’ విమర్శలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నాన్ని టార్గెట్‌ చేసి విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఆయన తమిళంలో నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ వేదిక కోసం ‘నవరస’ పేరుతో తీస్తోన్న వెబ్‌సిరీ్‌సలో మణిరత్నం, కార్తీక్‌ను తీసుకోవడంతో నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గాయకుడు కార్తీక్‌పై కూడా చిన్మయి ‘మీటూ’ విమర్శలు చేశారు. దీనిపై చిన్మయి చేసిన విమర్శలు మణిరత్నం హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. ‘‘మీరు ఎలాంటి వారికి అవకాశం ఇస్తున్నారో ఒకసారి చూసుకోండి. ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి మీరు అవకాశం ఇస్తున్నారు. వేధింపులకు దిగిన వ్యక్తికి అండగా నిలవడం సరికాదు. వైరముత్తు, రాధారవి నాకు అవకాశాలు లేకుండా చేశారు. మాలాంటి బాధితులకు మాత్రం మీరు అవకాశం ఇవ్వడంలేదు’’ అంటూ మణిరత్నాన్ని ఆమె ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

Updated Date - 2020-10-30T07:21:07+05:30 IST