మంచు విష్ణు కొత్త వంటకం
ABN , First Publish Date - 2020-04-16T02:33:45+05:30 IST
తాజాగా మంచు విష్ణు కొబ్టరికాయలోనే అన్నం, చికెన్ వండాడు. ఆ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

కరోనా వైరస్ ప్రభావంతో దేశమంతటా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ క్వారంటైన్ టైమ్‌లో సినీ సెలబ్రిటీలందరూ వారి కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడపడమే కాదు.. పాక శాస్త్రంలో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా మంచు విష్ణు కొబ్టరికాయలోనే అన్నం, చికెన్ వండాడు. ఆ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన విష్ణు ‘‘కొబ్బరి కాయల లోపల కాల్చిన బియ్యం, చికెన్ వేసి కొత్తగా వండటానికి ప్రయత్నిస్తున్నాను. లాక్ డౌన్ పూర్తయ్యేలోపు నేను చాలా పేటెంట్లతో చెఫ్‌గా మారుతాను’’ అంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేశారు. మంచు విష్ణు పోస్ట్ చేసిన వీడియోలో మోహన్‌బాబు, లక్ష్మీ మంచు కూడా కనపడ్డారు. విష్ణు వండిన వంటకాన్ని వారు టేస్ట్ చేసి అద్భుతం అంటూ కితాబిచ్చారు.
Read more