షాకింగ్: బరువు తగ్గిన మంచు మనోజ్

ABN , First Publish Date - 2020-12-25T19:06:53+05:30 IST

మంచు హీరో మనోజ్ బరువు తగ్గాడు. ఏకంగా 15 కిలోలు తగ్గి స్మార్ట్ లుక్‌లోకి మారాడు.

షాకింగ్: బరువు తగ్గిన మంచు మనోజ్

మంచు హీరో మనోజ్ బరువు తగ్గాడు. ఏకంగా 15 కిలోలు తగ్గి స్మార్ట్ లుక్‌లోకి మారాడు. ఆయుర్వేదిక్ డైట్, కఠినమైన వ్యాయామం చేసి మనోజ్ స్లిమ్‌గా మారాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. అందరికీ వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపాడు. వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్ కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 


ప్రస్తుతం మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించి వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం `అహం బ్రహ్మాస్మి` సినిమా చేస్తున్న మనోజ్ మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ మూడు సినిమాలూ వచ్చే ఏడాదే విడుదలకు సిద్ధమవుతున్నాయి. 

Updated Date - 2020-12-25T19:06:53+05:30 IST