అదొక్కటే బాధించింది - మలైకా అరోరా

ABN , First Publish Date - 2020-09-20T05:18:50+05:30 IST

కరోనా వల్ల కలిగే ఇబ్బందులకు సినిమా స్టార్స్‌ అతీతులు కారు అంటున్నారు బాలీవుడ్‌ బ్యూటీ మలైకా అరోరా. కొన్ని రోజుల క్రితమే కరోనా బారిన పడిన మలైకా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు.

అదొక్కటే బాధించింది - మలైకా అరోరా

కరోనా వల్ల కలిగే ఇబ్బందులకు సినిమా స్టార్స్‌ అతీతులు కారు అంటున్నారు బాలీవుడ్‌ బ్యూటీ మలైకా అరోరా. కొన్ని రోజుల క్రితమే కరోనా బారిన పడిన మలైకా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ‘‘తగినంత సమయం దొరకడంతో ‘గాన్‌  విత్‌ ద విండ్‌ ’ సహా నాకు నచ్చిన క్లాసిక్‌ బుక్స్‌ చదువుతూ గడిపేశాను. కానీ క్వారంటైన్‌ సమయంలో నా కొడుకును దగ్గరకు తీసుకోలేకపోవడం నన్ను తీవ్రంగా బాధించింది. ఇన్ని రోజులూ బాల్కనీలో నిలబడి దూరం నుంచే ఒకరిని ఒకరం చూస్తూ మాట్లాడుకున్నాం’’ అని మలైకా చెప్పారు. ప్రస్తుతం క్వారంటైన్‌ పూర్తవడంతో మరోసారి కొవిడ్‌ పరీక్ష చేయించుకొని ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అర్జున్‌కపూర్‌తో ఆమె డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అర్జున్‌కు కరోనా రావడంతో ముందు జాగ్రత్తగా ఆమె కూడా టెస్ట్‌ చేయించుకున్నారు.        

Updated Date - 2020-09-20T05:18:50+05:30 IST