అర్జున్‌తో పెళ్లిపై మలైకా స్పందన!

ABN , First Publish Date - 2020-05-04T18:37:49+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్న మలైకా అరోరా 19 ఏళ్లు

అర్జున్‌తో పెళ్లిపై మలైకా స్పందన!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్న మలైకా అరోరా 19 ఏళ్లు వైవాహిక జీవితం సాగించింది. వీరిద్దరికీ 17 ఏళ్లు కొడుకు కూడా ఉన్నాడు. 2017లో భర్త నుంచి మలైకా విడాకులు తీసుకుంది. తన కంటే 12 ఏళ్లు చిన్నవాడైన బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ బహిరంగంగానే విదేశీ పర్యటనలకు, ఫంక్షన్లుకు కలిసి తిరగడం ప్రారంభించారు. 


వీరి పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ ఛిట్‌ఛాట్‌లో పాల్గొన్న మలైకా.. అర్జున్‌తో పెళ్లి గురించి మాట్లాడింది. `ఏదో ఒక సమయంలో నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో మాకు తెలుసు. పరిస్థితులు అనుకూలిస్తే త్వరగానే మా నిర్ణయం చెబుతాం. అప్పటివరకు ఏదీ చెప్పలేన`ని మలైకా తెలిపింది. ఇక, పిల్లల గురించి అడిగిన ప్రశ్నకు మలైకా సమాధానం ఇవ్వలేదు. 

Updated Date - 2020-05-04T18:37:49+05:30 IST