మేజర్‌ ఫస్ట్‌ లుక్‌

ABN , First Publish Date - 2020-12-18T05:12:13+05:30 IST

26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఎన్‌ఎస్‌జీ కమాండో సందీప్‌ ఉన్నికృష్ణన్‌ కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మేజర్‌’. టైటిల్‌ పాత్రను అడివి శేష్‌ పోషిస్తున్నారు. శశి కిరణ్‌ తిక్కా దర్శకత్వంలో...

మేజర్‌ ఫస్ట్‌ లుక్‌

26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఎన్‌ఎస్‌జీ కమాండో సందీప్‌ ఉన్నికృష్ణన్‌ కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మేజర్‌’. టైటిల్‌ పాత్రను అడివి శేష్‌ పోషిస్తున్నారు. శశి కిరణ్‌ తిక్కా దర్శకత్వంలో గురువారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ను మహేశ్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసి శేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేసినందుకు ఆనందంగా ఉంది., ఇందులో మీరు ఉత్తమ నటన కనబరుస్తారని నమ్మకం ఉంది’’ అని మహేశ్‌ అన్నారు.


ఈ చిత్రంలో సందీప్‌ వీర మరణం పొందిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం తదితర అంశాలను ప్రస్తావించనున్నారు. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. పాన్‌ ఇండియా సినిమాగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో శోభితా దూళిపాళ్ల,  ప్రకాష్‌రాజ్‌, రేవతి, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ సహకారంతో సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2021 సమ్మర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-18T05:12:13+05:30 IST