వంశీపైడిపల్లికి మహేష్ విషెస్!

ABN , First Publish Date - 2020-07-27T18:02:29+05:30 IST

సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకుడు వంశీపైడిపల్లి మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే

వంశీపైడిపల్లికి మహేష్ విషెస్!

సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకుడు వంశీపైడిపల్లి మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో `మహర్షి` సినిమా వచ్చింది. `సరిలేరు నీకెవ్వరు` సినిమా తర్వాత వంశీ దర్శకత్వంలోనే మహేష్ సినిమా చేయాలనుకున్నాడు. అయితే వంశీ చెప్పిన కథ మహేష్‌కు నచ్చకపోవడంతో ఆ సినిమాను పక్కనపెట్టినట్టు వార్తలు వచ్చాయి. 


ఈ రోజు (సోమవారం) పుట్టినరోజు జరుపుకుంటున్న వంశీపైడిపల్లికి ట్విటర్ ద్వారా మహేష్ బాబు విషెస్ తెలియజేశాడు. `దర్శకుడు వంశీపైడపల్లికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఛార్మింగ్‌గా ఉండాలి. అలాగే నువ్వు ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా` అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. 
Updated Date - 2020-07-27T18:02:29+05:30 IST

Read more