పూరీకి మహేష్ విషెస్!

ABN , First Publish Date - 2020-09-28T17:43:51+05:30 IST

సూపర్‌స్టార్ మహేష్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌ అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో క్రేజ్.

పూరీకి మహేష్ విషెస్!

సూపర్‌స్టార్ మహేష్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌ అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో క్రేజ్. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే `పోకిరి`, `బిజినెస్‌మేన్` వంటి సూపర్‌హిట్ సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన `జనగణమణ` సినిమా ఆగిపోయింది. దీంతో వీరి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. 


ఈ రోజు (సోమవారం) పూరీ జగన్నాథ్ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా పూరీకి మహేష్ విషెస్ చెప్పాడు. `నా అభిమాన డైరెక్టర్లలో ఒకరైన పూరీ జగన్నాథ్‌గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ సంతోషంగా, విజయోత్సాహంతో ఉండాలని కోరుకుంటున్నా` అంటూ ట్వీట్ చేశాడు. 
Updated Date - 2020-09-28T17:43:51+05:30 IST