చిరంజీవిగారిని తీసుకెళ్తా: మహేష్ బాబు

ABN , First Publish Date - 2020-02-18T17:49:51+05:30 IST

ఈ సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్నసూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు

చిరంజీవిగారిని తీసుకెళ్తా: మహేష్ బాబు

ఈ సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు ప్ర‌స్తుతం తన కుటుంబంతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. అలాగే తన తర్వాతి సినిమా కోసం సన్నద్ధమవుతున్నాడు. మహేష్ తర్వాతి సినిమాకు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడు. వచ్చే నెల‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 


తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ ప‌లు ఆస‌క్తిక‌ర‌ ప్రశ్నలకు స‌మాధానాలు చెప్పాడు. `ఒకవేళ మీ బయోపిక్ తెరకెక్కితే.. మీ పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుంది?` అని అడిగితే.. `నాది చాలా సింపుల్, బోరింగ్ లైఫ్. నా బయోపిక్ వర్కవుట్ అవద`ని మహేష్ సమాధానమిచ్చాడు. అలాగే `ఒకవేళ మీరు లాంగ్ రోడ్ ట్రిప్‌కు వెళితే మీతోపాటు సినీ ఇండస్ట్రీకి చెందిన ఎవర్ని తీసుకెళ్తారు?` అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన మహేష్.. `చరణ్‌, తారక్‌.. అలాగే బ్యాలెన్స్‌ చేయడానికి చిరంజీవిగారిని తీసుకెళ్తాను` అని సమాధానమిచ్చాడు. అలాగే `మీరు ఒక‌రోజు సీఎం అయితే ఏం చేస్తారు?` అనే ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. `నేను సీఎం అయితే రాష్ట్రాన్ని దేవుడే కాపాడాల`ని చెప్పాడు. 

Updated Date - 2020-02-18T17:49:51+05:30 IST