మహేష్ సర్‌ప్రైజ్.. పరశురామ్ ఎమోషనల్!

ABN , First Publish Date - 2020-11-14T22:37:48+05:30 IST

సూపర్‌స్టార్ మహేష్ బాబు తన దర్శకుడు పరశురామ్‌కు సర్‌ప్రైజ్ బహుమతులు అందించాడు.

మహేష్ సర్‌ప్రైజ్.. పరశురామ్ ఎమోషనల్!

సూపర్‌స్టార్ మహేష్ బాబు తన దర్శకుడు పరశురామ్‌కు సర్‌ప్రైజ్ బహుమతులు అందించాడు. ఆ బహుమతులు చూసి పరశురామ్ ఎమోషనల్ అయ్యాడు. పరశురామ్ రూపొందించనున్న `సర్కారు వారి పాట` సినిమాలో మహేష్ నటించబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 


దీపావళి సందర్భంగా పరశురామ్‌కు మహేష్ విషెస్‌తోపాటు బహుమతులు కూడా పంపించాడు. వాటిని పరుశురామ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. `మా సూపర్‌స్టార్ మహేష్ బాబు నుంచి అందమైన కానుక. ఈ దీపావళిని నా జీవితంలోనే ప్రత్యేకమైనదిగా మార్చినందుకు ధన్యవాదాలు సర్. మీకు, మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు` అని పరశురామ్ పేర్కొన్నాడు.  
Updated Date - 2020-11-14T22:37:48+05:30 IST